Monday, June 8, 2026
HomeTrending Newsమీరు వ్యతిరేకిస్తున్నారా?: వెల్లంపల్లి

మీరు వ్యతిరేకిస్తున్నారా?: వెల్లంపల్లి

Are You OK?: కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే తెలుగుదేశం పార్టీ కనీసం దాన్ని హర్షించలేని పరిస్థితిలో ఉందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారో, మద్దతు పలుకుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు కావాలని కోరుతున్న నందమూరి బాలకృష్ణ, తన తండ్రి పేరిట జిల్లా ఏర్పాటవుతుంటే ఎందుకు స్వాగతించలేకపోయారని  ప్రశ్నించారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు కనీసం ఇలాంటి ఆలోచనే రాకపోవడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు, బాలకృష్ణలు కలిసే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని వెల్లంపల్లి గుర్తు చేశారు.

కృష్ణాజిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలంటూ టిడిపి నేత బొండా ఉమా చేసిన డిమాండ్ పై కూడా వెల్లంపల్లి స్పందించారు. రంగా పేరెత్తే నైతిక అర్హత టిడిపి నాయకులకు లేదన్నారు. రంగాను హత్య చేసిందే టిడిపి అని వెల్లంపల్లి పేర్కొన్నారు.

కడపపై బిజెపి నేత సోము వీర్రాజు  చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. సోము ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని, హత్యలు చేసుకునేవారికి ఎయిర్ పోర్టులు కావాలా అంటూ మాట్లాడడం అయన దిగజారుడు తనానికి నిదర్శనన్నారు. రాష్ట్రంలో బిజెపిని టిడిపికి అమ్మేస్తున్నారని ఆరోపించారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఈ రకంగా మాట్లాడడం భావ్యం కాదన్నారు. మొన్న సారాయిపై కూడా ఇలాగే మాట్లాడారని, తప్పుడు మాటలు మాట్లాడడం, ఆ తర్వాతా మీడియా సృష్టి అని చెప్పడం ఆయనకు అలవాటైపోయిందని వెల్లంపల్లి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular