Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

From October: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో, టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ ‌(చిన‌బాబు) నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతోంది. ఈ చిత్రంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు పూజాహెగ్డే నటిస్తున్నారు.

మ‌హేష్‌బాబు , త్రివిక్ర‌మ్ ల హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబందించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది  చిత్ర యూనిట్. జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా, అలాగే కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడుగా పి.ఎస్.వినోద్, సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `అత‌డు`, `ఖ‌లేజా` దశాబ్ద కాలానికి పైగా నేటికీ ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని అల‌రిస్తూనే ఉన్నాయి. దశాబ్ద కాలానికి పైగా ఎదురు చూస్తున్న ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో మ‌రో బిగ్గెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతోంది అన్న వార్త అభిమానుల ఆనందాన్ని అంబరాన్ని తాకేలా చేసింది. ఆగస్టు నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. వచ్చే ఏడాది (2023) వేసవి లో చిత్రం విడుదల అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన‌ ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, మరిన్ని ఇతర వివరాలు త్వరలో మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చిత్ర నిర్మాత ఎస్.రాధా కృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com