8.8 C
New York
Sunday, December 10, 2023

Buy now

Homeసినిమాసెంటిమెంట్ ఫాలో అవుతున్న మహేష్‌

సెంటిమెంట్ ఫాలో అవుతున్న మహేష్‌

సూపర్ స్టార్ మహేష్‌ బాబు 28వ చిత్రం చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్  దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేష్ కు జంటగా క్రేజీ హీరోయిన్స్ పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. అయితే.. ఈ మూవీ టైటిల్ అంటూ కొన్ని టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఉగాదికి ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తారని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు అయితే…. ఉగాదికి కాకుండా సరైన సమయంలో ఈ మూవీ అప్ డేట్ ఇస్తామన్నారు.

అయితే… ఆగష్టు 11న ఈ చిత్రం వస్తుందని గతంలో ప్రకటించారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నట్టుగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కానీ.. టైటిల్ అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున ఈ మూవీ నుంచి ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్ డేట్ ఇవ్వనున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. మహేష్ కి నాన్న అంటే ఎంతో గౌరవం, ప్రేమ. అలాగే ఆయన పుట్టిన రోజు సెంటిమెంట్ కూడా ఉంది. ప్రతీ ఏడాది తండ్రి జన్మదినం రోజు తన సినిమా అప్ డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషి చేయడం మహేష్ కి ఇష్టం.

ఇది గత కొన్ని సంవత్సరాలుగా సెంటిమెంట్ గా మారింది. అదే సెంటిమెంట్ తో ఇప్పుడు కృష్ణ పుట్టినరోజు నాడు SSMB28 టైటిల్ తో ఓ పోస్టర్ లేదా టీజర్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు మహేష్‌. సినిమా సంక్రాంతికి రానుంది కనుక మే నెలలో ఒక అప్ డేట్ ఇచ్చేసి మళ్ళీ నవంబర్ లేదా డిసెంబర్ నుండి ప్రమోషన్స్ మొదలు పెడతారు. ఈ ఏడాది కృష్ణ పుట్టినరోజు క్రేజీ అప్ డేట్ తో ఫ్యాన్స్ కి ఆయనను గుర్తుచేస్తూ మహేష్ తండ్రిను స్మరించుకోనున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్