Mahinda Rajapaksa Resigns : శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స ఎట్టకేలకు రాజీనామా చేశారు. గత కొద్దిరోజులుగా విపక్షాలు నిరసనలు హోరెత్తించడంతో ప్రధాని రాజపక్స రాజీనామా చేయక తప్పలేదు. ప్రజలు దేశాధ్యక్ష భవనాన్ని ముట్టడించేందుకు గత 20 రోజులుగా విఫలయత్నం చేస్తున్నారు.
అధ్యక్షుడు గోటబాయ రాజపక్స రెండోసారి అత్యవసర పరిస్థితి విధించటంతో అమెరికా, యురోపియన్ యూనియన్ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రజలతో చర్చలు జరపాలని సూచించటంతో రాజపక్స కుటుంబం పునరాలోచనలో పడింది. ముందుగా విపక్ష నాయకుడు ప్రేమదాసను తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరినా ఆయన ససేమిరా అన్నారు. రాజపక్స కుటుంబం ప్రభుత్వం నుంచి బయటకు వస్తేనే దేశంలో శాంతి నెలకొంటుందని అన్నారు.
అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగటంతో ప్రధాని రాజపక్స రాజీనామా చేయక తప్పలేదు. అయితే లంకవాసులు, ఆ దేశ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు దేశాధ్యక్షుడు గోటబాయ రాజపక్స కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
Also Read : లంకలో నిరసనల హోరు.. రాజపక్స రాజీనామాకు డిమాండ్