Saturday, September 21, 2024
HomeTrending Newsరాజపక్సకు గుణపాఠం- తమిళ ఈళం సానుభూతిపరులు

రాజపక్సకు గుణపాఠం- తమిళ ఈళం సానుభూతిపరులు

Tamil Eelam : శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స రాజీనామా ఆ తర్వాత రాజపక్స కుటుంబ ఆస్తుల ద్వంసం నిరసనలతో కొలంబో నగరం రణరంగంగా మారింది. అయితే రాజపక్సకు తగిన గుణపాఠం జరిగిందని తమిళ ఈళం సానుభూతిపరులు అంటున్నారు. సిలోన్ లో తమిళ ఉద్యమం అణచివేత పేరుతో మహింద రాజపక్స తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాడని, చిన్నారులు, మహిళలు అని చూడకుండా ఉచకోతకు పాల్పడ్డాడని మానవహక్కుల సంఘాలు, తమిళ ఈళం సానుభూతిపరులు విమర్శించాయి. మహింద రాజపక్స బంకర్ లో ఉన్న ఫోటోతో వ్యంగ్యంగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈరోజు ప్రభాకరన్ జీవించి ఉంటే మహీంద రాజపక్సేను కొలంబో నడిరోడ్డు మీద కత్తికో కండగా నరికి  ఆ రక్తాన్ని LTTE అమరుల స్థూపాల పునాదుల మీద  పోసి కచ్చితంగా ఈ రోజు శ్రీలంక దేశానికి అన్ని వర్గాల ప్రజలు {సింహాల ప్రజలతో సహా} సంఘాలు రాజకీయ పార్టీల మద్దతుతో  తిరుగులేని అధ్యక్షుడు అయ్యేవాడని తమిళ సంఘాలు అభిప్రాయపడ్డాయి. నాయకులు జీవిస్తారు అమరత్వం పొందుతారు కానీ  ఆయా పార్టీలు ఆయా నాయకులు ఇచ్చిన చైతన్యo  తిరుగుబాటు ప్రశ్నించే తత్వo మాత్రం ఖచ్చితంగా కొన్ని తరాల వరకు జీవిస్తూనే ఉంటుందన్నారు.

ప్రభాకరన్ శ్రీలంకలోనే కాదు ప్రపంచంలో తిరగబడ్డ ఏ జాతి పిడికిలేత్తిన ఆ బిగి పిడికిల్లలో ఉదయిస్తూనే ఉంటాడని MDMK నేత వైకో అన్నారు. తమిళుల హక్కులు కాలరాసిన లంక పాలకులు ఇప్పుడు స్వదేశ పౌరులనే మోసం చేశారని విమర్శించారు. రాజపక్స కుటుంబ సభ్యులకు భారత్ లో ఆశ్రయం ఇస్తే కేంద్ర ప్రభుత్వానికి తమిళ ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఉద్యమం మొదలవుతుందని తమిళ సంఘాలు హెచ్చరించాయి.

Also Read : మహింద రాజపక్స రాజీనామా

RELATED ARTICLES

Most Popular

న్యూస్