Maithili Thakur Is Patriotic :
బీహర్‌లోని బేనిపట్టీకి చెందిన మైథిలి ఠాగూర్ గురించి తెలియని వారుండరు. 22 ఏళ్ళ మైథిలి తన తండ్రి రమేష్ ఠాకుర్ నుంచి సంగీతం నేర్చుకుని వివిధ సంగీత పోటీల్లో అనేక బహుమతులు గెలుచుకున్న ఆమె మరోసారి సంచలనంగా మారింది. ఆమెకు బాలీవుడ్ నుంచి ఒకేసారి 10 సినిమాల్లో పాటలు పాడేందుకు మంచి ఆఫర్ రాగా దాన్ని నిర్ధ్వంధంగా తిరస్కరించింది. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన అవకాశాన్ని మైథిలి తిరస్కరించటం ఉత్తరాది రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ మొత్తం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, హిందూ సాంప్రదాయాలను అగౌరవపరిచేలా, భారతీయ చరిత్రను వక్రీకరించేలా, దేశభక్తులనూ సైనికులనూ అవమానించేలా సినిమాలు తీస్తున్నదనీ ఈ సంస్క్రృతి బాలీవుడ్‌లో మారనంతవరకు తాను బాలీవుడ్ సినిమాలకు పాటలు పాడననీ తెగేసి చెప్పింది. గాయకులు ఎవరైనా ఇంతటి ఆఫర్ వదులుకుంటారా అని ఆమె బంధువులు, స్నేహితులూ వత్తిడి తెచ్చినా ఆమె అదే సమాధానం చెప్పింది. ఆమె నాన్నగారు రమేష్ ఠాకుర్ కూడా ఆమె అభిప్రాయాన్నే సమర్థించారు. సంపాదన కోసం ప్రాంతాలు, కాలంతో పని లేకుండా రేయింబవళ్ళు కష్టపడుతున్న యువతకు ఆడర్శవంతురాలిగా మైథిలి నిలిచింది.
Also Read : పంజాబ్ లో రాబోయేది ఆప్ ప్రభుత్వమే