‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’.. కన్నడ నుంచి వచ్చిన ఈ రెండు చిత్రాలు జాతీయ స్థాయిలో సత్తా చాటాయి.యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ చిత్రం భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని భాషల్లో కలెక్షన్స్ రాబట్టాయి. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే… సెకండ్ పార్ట్ మరింతగా ఆకట్టుకుంది. రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ రేంజ్ మూవీ వస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే.. కేజీఎఫ్ 2 సినిమా ఎండింగ్ లో పార్ట్ 3 ఉంటుంది అన్నట్టుగా హింట్ ఇచ్చారు కానీ.. ఎప్పుడు ఉంటుందో చెప్పలేదు.
అయితే… కేజీఎఫ్ 2 సినిమా రిలీజై ఏప్రిల్ 14కి సంవత్సరం అయ్యింది. ఈ సందర్భంగా మేకర్స్ సోషల్ మీడియాలో ఇచ్చిన చిన్న హింట్ ఇప్పుడు కేజీఎఫ్ చిత్రానికి మరో పార్ట్ రానుందన్న వార్తలకు బలాన్ని చేకూర్చాయి. కేజీఎఫ్ పార్ట్ 3 గురించి వస్తున్న వార్తలను చిత్ర యూనిట్ కూడా ఖండించలేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న హింట్స్ ఇస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది. ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన వీడియోలో.. రాకీ భాయ్ 1978 నుంచి 1981 వరకు ఎక్కడ ఉన్నారు..?’ అనే ఆసక్తికరమైన పాయింట్‌ను హైలట్ చేశారు.
దీంతో ఇదే సబ్జెక్ట్‌ను ఇతివృత్తంగా చేసుకొని సినిమా ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘సలార్’ సినిమా చేస్తున్నారు. ప్రభాస్ తో చేస్తున్న సలార్ మూవీ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఈ సినిమా కూడా రెండు పార్టులుగా రాబోతుందని టాక్. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ చేయనున్నారు. ఆతర్వాత సలార్ 2 ఉంటుందా..? ‘కేజీఎఫ్ 3’ ఉంటుందా..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. కేజీఎఫ్ 3 ఉంటుంది అనేది మాత్రం కన్ ఫర్మ్ అయ్యింది. ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో తెలియాల్సివుంది.