Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్మలేషియా-బెల్జియం మ్యాచ్ డ్రా

మలేషియా-బెల్జియం మ్యాచ్ డ్రా

Match drawn:
హాకీ పురుషుల జూనియర్ వరల్డ్ కప్ లో  మలేషియా-బెల్జియం జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా గా ముగిసింది. ఈ మెగా టోర్నీ మూడోరోజు మ్యాచ్ లు పూర్తయ్యే సమయానికి ఇప్పటివరకూ మొత్తం 15 మ్యాచ్ లు జరగగా ఈ మ్యాచ్ ఒక్కటే ఫలితం తేలకుండా ముగిసింది.

నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం సాధించింది. చిలీపై 5-1 గోల్స్ తేడాతో గెలిచింది. పూల్ ‘సి’ నుంచి జరిగిన మ్యాచ్ ల్లో అమెరికాపై దక్షిణ కొరియా 5-1 గోల్స్ తో విజయం సాధించింది. ఇదే పూల్ నుంచి జరిగిన మరో మ్యాచ్ లో స్పెయిన్ పై నెదర్ల్యాండ్స్ 3-2 తేడాతో గెలిచింది. పూల్ ‘డి’లో అర్జెంటీనాపై జర్మనీ 2-3 తేడాతో విజయం సాధించింది.

ఈ మెగా టోర్నీలో ఇండియా రేపు పోలాండ్ తో తలపడనుంది. టోర్నీ మొదటిరోజు ఫ్రాన్స్ చేతిలో ఓటమి పాలైన ఇండియా రెండోరోజు నిన్న కెనడాపై 13-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది.

Also Read : టెస్ట్: ఇండియా-345; న్యూజిలాండ్ 129/0

RELATED ARTICLES

Most Popular

న్యూస్