Tuesday, June 9, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్కేంద్రం సరైన నిర్ణయం : విష్ణు

కేంద్రం సరైన నిర్ణయం : విష్ణు

కేంద్ర జల్ శక్తి శాఖ విడుదల చేసిన గెజిట్ ను స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు చెప్పారు. కేంద్రం సరైన నిర్ణయం తీసుకుందని, ఈ గెజిట్ నోటిఫికేషన్ వల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని అయన అభిప్రాయ పడ్డారు. అక్రమ ప్రాజెక్టులు ఎవరు కట్టినా అది సమంజసం కాదని, ప్రాజెక్టులకు ముందుగా అనుమతులు తీసుకోవాలని అన్నారు. ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విష్ణు కోరారు.

కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం ఏడు అక్రమ ప్రాజెక్టులు కడుతోందని, పోలీసు పహారా లో నీటిని దోచుకుంటోందని అయన ఆరోపించారు. దిగువ రాష్ట్రాల హక్కులను పరిగణన లోకి తీసుకోకపోవడం సరికాదని హితవు పలికారు. తెలంగాణా ఏకపక్ష నిర్ణయాలతో ఆంధ్ర ప్రదేశ్ కు నష్టం వాటిల్లుతోందని అందుకే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సిఎం జగన్ కోరిన విషయాన్ని మల్లాది గుర్తు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular