Monday, June 8, 2026
Homeసినిమామ‌మ‌తామోహ‌న్ దాస్ ‘లాల్ బాగ్’ 26న

మ‌మ‌తామోహ‌న్ దాస్ ‘లాల్ బాగ్’ 26న

Lal Bagh on 26th
‘యమదొంగ’, ‘చింత‌కాయ‌ల ర‌వి’, ‘కింగ్’ త‌దిత‌ర‌ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన మ‌మ‌తామోహ‌న్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “లాల్ బాగ్”. ఐటీ, థ్రిల్ల‌ర్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్ర‌శాంత్ ముర‌ళి ప‌ద్మనాభ‌న్ దర్శకుడు. సంపత్ కుమార్ సమర్పణలో సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్ పై రాజ్ జకారియా నిర్మిస్తున్నారు. నందిని రాయ్, సిజోయ్ వ‌ర్గిస్‌, అజిత్ కోషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాహుల్‌ రాజ్‌ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రాన్ని నవంబర్ 26న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

ఈ సందర్భంగా సమర్పకులు ఏ. సంపత్ కుమార్ మాట్లాడుతూ.. థ్రిల్లర్ జోనర్ లో ఒక విభిన్న కథాచిత్రంగా లాల్ బాగ్ సినిమా రూపొందింది. మ‌మ‌తామోహ‌న్ దాస్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. నందిని రాయ్, సిజోయ్ వ‌ర్గిస్‌, అజిత్ కోషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్ర‌శాంత్ ముర‌ళి ప‌ద్మానాభ‌న్ అధ్బుతంగా తెరకెక్కించారు. మా సినిమా తప్పకుండా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది” అన్నారు.

Also Read : ‘గాడ్ ఫాదర్’ లో నయనతార

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular