Saturday, January 18, 2025
Homeసినిమాఅది నిజం కాదు : మానస రాధాకృష్ణన్

అది నిజం కాదు : మానస రాధాకృష్ణన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ మూవీ సెట్స్ పైకి వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టైటిల్ అండ్ పోస్టర్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు హల్ చల్ చేశారు. అయితే… అఫిషియల్ గా రిలీజ్ చేస్తామని.. అప్పటి వరకు ప్రచారంలో ఉన్న వార్తలను నమ్మద్దు అంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే… ఈ సినిమాలో పవన్ సరసన యంగ్ అండ్ బ్యూటిఫుల్ మలయాళ నటి మానస రాధాకృష్ణన్ నటిస్తుంది అన్న వార్తలు వినిపించాయి. తాజాగా ఈ వార్తల పై హీరోయిన్‌ మానస రాధాకృష్ణన్‌ స్పందించింది. .తాను పవన్ కళ్యాణ్‌ సినిమాలో నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆమె సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఈ సంవత్సరంలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా షూటింగ్ లకు బ్రేక్ పడడంతో వచ్చే సంవత్సరంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్