1.3 C
New York
Thursday, December 7, 2023

Buy now

HomeTrending Newsకేసియార్ బొమ్మ వల్లే ఈటెల గెలుపు : గంగుల

కేసియార్ బొమ్మ వల్లే ఈటెల గెలుపు : గంగుల

హుజురాబాద్ లో కెసియార్ బొమ్మ వల్లే ఈటెల రాజేందర్ ఇన్నిసార్లు గెలిచారని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.  హుజురాబాద్ నియోజకవర్గంలో  మంత్రులు గంగుల, కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ తనకు ఈటెల పై వ్యక్తిగత ద్వేషం ఏమీలేదని, కానీ ఆయనకే ఎదుటివారు సంబరపడితే ఈర్ష్య పడే గుణం ఉందని వ్యాఖానించారు. ఈటెల టి ఆర్ ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశారన్నారు. గతంలో రైతు వ్యతిరేక చట్టాలు చేశారంటూ బిజెపిని విమర్శించిన ఈటెల ఇప్పుడు దమ్ముంటే ఆ చట్టాలను ప్రశ్నించాలని సవాల్ చేశారు. హుజురాబాద్ అభివృద్ధి చెందాలంటే టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

వ్యక్తులు ముఖ్యం కాదని, వ్యవస్థ ముఖ్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. ఈటెల కు పార్టీలో, ప్రభుత్వంలో సిఎం కెసియార్ సముచిత గౌరవం ఇచ్చారని గుర్తు చేశారు. ఆయనకు ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అయన తన వ్యక్తిగత విషయాలను పార్టీపై రుద్దుతున్నారని కొప్పుల ఆరోపించారు. గుజరాత్ లో దళితులు, ముస్లిం లను ఊచకోత కోసిన పార్టీలో ఎలా చేరతారని ప్రశ్నించారు. మంచి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిందని వెల్లడించారు.

ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఉప ఎన్నిక జరగబోతోంది. అధికార టిఆర్ఎస్ ఇప్పటికే రంగంలోకి దిగి మండలాలు, గ్రామాల వారీగా కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి ఈటెల వైపు పార్టీ కేడర్ వెళ్ళకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసేలా యంత్రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్