Thursday, May 8, 2025
Homeస్పోర్ట్స్The Ashes: ఇంగ్లాండ్ బ్యాడ్ లక్, నాలుగో టెస్ట్ డ్రా

The Ashes: ఇంగ్లాండ్ బ్యాడ్ లక్, నాలుగో టెస్ట్ డ్రా

ఇంగ్లాండ్ ను మరోసారి దురదృష్టం వెంటాడింది. యాషెస్ సిరీస్ లో భాగంగామాంచెస్టర్ లో జరుగుతోన్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ విజయావకాశాలను వరుణుడు దెబ్బ తీశాడు. నాలుగో రోజు కేవలం 31 ఓవర్లు మాత్రమే సాగగా నేడు ఐదోరోజు అది కూడా లేదు. ఒక్క బంతి కూడా పడకుండానే ముగిసింది. దీనితో మ్యాచ్ ను డ్రాగా ప్రకటించారు. నిన్న నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు కోల్పోయి 214 స్కోరు చేసి ఇంకా 61 పరుగులు వెనకబడి ఉంది. నేడు తొలి సెషన్ లో ఆసీస్ ను ఆలౌట్ చేసి విజయం సాధించాలన్న ఆతిథ్యం ఇంగ్లాండ్ ఆశలు నెరవేరలేదు.

జాక్ క్రాలే కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

ఇంగ్లాండ్ కు విజయం త్రుటిలో చేజారడం ఇది కొత్తేమీ కాదు. ముఖ్యంగా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ లో గతంలో కూడా ఇలా జరిగింది.

యాషెస్ సిరీస్ – 2023, ఐదు టెస్టుల సిరీస్ లో  ప్రస్తుతం 2-1 తో ఇంగ్లాండ్ వెనకబడి ఉంది.

చివరి టెస్ట్ ఈ నెల 27 నుంచి ఓవల్ మైదానంలో జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్