Friday, March 29, 2024
Homeసినిమా‘మంచి రోజులు వచ్చాయి’ ప్రోమో సాంగ్ విడుదల

‘మంచి రోజులు వచ్చాయి’ ప్రోమో సాంగ్ విడుదల

యువ హీరో సంతోష్ శోభన్ – మెహ్రీన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ‘ఏక్ మినీ కథ’ తో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో సంతోష్ శోభన్ ఈ చిత్రంలో మెయిన్ లీడ్ నటిస్తుంటే.. ‘మహానుభావుడు’ సూపర్ హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు. టాక్సీవాలా తర్వాత ఈయన నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది.

ఈ కాంబోలో ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి సినిమా వస్తుంది. ఏక్ మినీ కథ హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్‌తో మరోసారి జోడీ కట్టాడు సంతోష్ శోభన్. తాజాగా ఈ సినిమా నుంచి సోసో గా ఉన్న ప్రోమో సాంగ్ విడుదలైంది. ప్రముఖ లిరిక్ రైటర్ కేకే సాహిత్యం అందించిన ఈ సాంగ్ ను సెన్సేషనల్ సింగర్  సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఆగస్ట్ 16న ఫుల్ సాంగ్ విడుదల కానుంది. ఈ ప్రోమో సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్