Wednesday, March 11, 2026
Homeసినిమానవంబర్ 4న ‘మంచి రోజులు వచ్చాయి’ విడుదల

నవంబర్ 4న ‘మంచి రోజులు వచ్చాయి’ విడుదల

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’.  ఈ సినిమా నుంచి విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌, ‘సోసోగా ఉన్నా’, ‘ఎక్కేసిందే’ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. దీపావళి సందర్భంగా నవంబర్ 4న మంచి రోజులు వచ్చాయి విడుదల కానుంది. ఈ సందర్భంగా పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్. ‘మహానుభావుడు’ సూపర్ హిట్ తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు. ‘టాక్సీవాలా’ తర్వాత ఈయన నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, వి సెల్యులాయిడ్ SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి సినిమా వస్తుంది. ఏక్ మినీ కథ లాంటి హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్‌తో మరోసారి జోడీ కట్టాడు సంతోష్ శోభన్. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. మిగిలిన వివరాలు దర్శక నిర్మాతలు త్వరలోనే తెలియజేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular