Wednesday, March 11, 2026
Homeసినిమాఅమర సైనికుడి కుటుంబానికి మంచు కుటుంబం అండ

అమర సైనికుడి కుటుంబానికి మంచు కుటుంబం అండ

చిత్తూరు జిల్లా, ఐరాల మండలం, రెడ్డివారి పల్లి గ్రామానికి చెందిన 36 ఏళ్ళ సి.హెచ్. ప్రవీణ్ కుమార్ భారత సైన్యంలో అవల్దార్ గా పని చేసేవారు. శ్రీనగర్ 18వ రెజిమెంటులో విధులు నిర్వర్తిస్తుండగా ఉగ్రవాదులతో జరిగిన ఎదురుదాడిలో నవంబరు 8వ తేది, 2020న వీరమరణం పొందాడు. ఆయనకు భార్య రజిత, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రభుత్వ సాయం తప్ప వీరికి ఇతర ఎటువంటి సహాయమూ అందలేదు. వీరి కుటుంబంలో 64 మంది సభ్యులు భారతసైన్యంలో పని చేస్తున్నారు.

ప్రవీణ్ కుమార్ కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకున్న 18వ రెజిమెంట్ అధికారి కల్నల్ OLV, నరేష్, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఛైర్మన్ డా॥ మోహన్ బాబుకు స్వయంగా లేఖ వ్రాశారు. వారి కుటుంబాన్ని ఏ విధంగానైనా ఆదుకోమని లేఖ ద్వారా కోరారు. ఆ లేఖపై స్పందించిన మోహన్ బాబు మానవతా దృష్టితో ప్రవీణ్ కుమార్ కుమార్తె లోహితకు ఈ విద్యా సంవత్సరం 4వ తరగతి నుండి పూర్తి ఉచితవిద్య అందించడానికి అంగీకరించారు. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల CEO విష్ణు మంచుకి ప్రవీణ్ భార్య కృతజ్ఞతలు తెలియజేశారు.

విష్ణు మంచు స్పందిస్తూ దీనికి కృతజ్ఞతలు అక్కర్లేదని, దేశ సరిహద్దులో భారత వీరులు కంటికి రెప్పలా కాపాడుతుండడం వల్ల మనం సంతోషంగా ఉండగలుగుతున్నామని వారితో అన్నారు. వారిని ఆదుకోవడం, అండగా నిలవడం, చేతనైన సహాయం చెయ్యడం, ప్రతి భారతీయుని బాధ్యత అని ఆమెను ఓదార్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular