జకోవిచ్ వింబుల్డన్ టైటిల్ ను కూడా సొంతం చేసుకున్నాడు, సుమారు నెల రోజుల క్రితమే ఫ్రెంచ్ ఓపెన్ ను గెల్చుకున్న ఈ సెర్బియా సూపర్ స్టార్ వింబుల్డన్ లోను తనకు తిరుగులేదనిపించాడు. ఈ విజయంతో మొత్తం 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను గెల్చుకుని రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ ల సరసన ఆల్ టైం  విన్నర్స్ జాబితాలో నిలిచాడు.

నేడు జరిగిన వింబుల్డన్ ఫైనల్ లో ఇటలీ ఆటగాడు మాతో బెరిటినిపై 6-7,6-4, 6-4, 6-3 తేడాతో విజయం సాధించాడు. వింబుల్డన్ లో జకోవిచ్ కు ఇది హ్యాట్రిక్ విజయం. 2018, 2019, 2021 ల్లో ఈ టైటిల్ గెల్చుకున్నాడు. కోవిడ్ కారణంగా 2020వింబుల్డన్ పోటీలు జరగలేదు. మొత్తం ఆరుసార్లు వింబుల్డన్ విజేతగా నిలిచాడు జకోవిచ్.

ఈ ఏడాది ఫెబ్రవరిలో ఆస్ట్రేలియా ఓపెన్, జూన్ లో ఫ్రెంచ్ ఓపెన్, ఇప్పుడు వింబుల్డన్ వరుసగా ఒక ఏడాదిలో మూడు టైటిల్స్ గెలిచి చరిత్ర సృష్టించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *