Tuesday, June 16, 2026
Homeసినిమారణ్ బీర్, అభిషేక్ నామా, ఇప్పుడు మంచు మనోజ్

రణ్ బీర్, అభిషేక్ నామా, ఇప్పుడు మంచు మనోజ్

ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. ఈ చిత్రానికి ఓంరౌత్ డైరెక్టర్. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 16న ఆదిపురుష్ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ప్రీ రిలీజ్ తర్వాత అంచనాలు పెరగడంతో ఎప్పుడెప్పుడు ఆదిపురుష్ మూవీ వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ ఆదిపురుష్ మూవీ పై క్రేజ్ ఉండడం విశేషం. అయితే.. ఆదివారం నుంచి బుకింగ్స్ ఓపెన్ చేయగా రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.

బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ఆదిపురుష్ మూవీ పదివేల టిక్కెట్లు కొని అనాథలకు, చిన్న పిల్లలకు చూపించనున్నట్టు ప్రకటించాడు. అలాగే టాలీవుడ్ ప్రొడ్యూసర్ అభిషేక్ నామా కూడా పది వేల టిక్కెట్లను కొని గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆదిపురుష్ మూవీని చూపించనున్నట్టు అనౌన్స్ చేశారు. ఇప్పుడు మంచు మనోజ్ కూడా 2,500 మంది అనాధ పిల్లలకు ఆదిపురుష్ మూవీని చూపించబోతుండడం విశేషం. మనోజ్ మరియు ఆయన సతీమణి భూమా మౌనికా రెడ్డి కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు అనాధ శరణాలయాల్లోని 2500 మంది అనాధల కోసం టికెట్లు కొనుగోలు చేసి వారికి ఉచితంగా ఆదిపురుష్ మూవీని చూసే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular