Saturday, March 14, 2026
Homeసినిమాపవన్ కళ్యాణ్ తో మంచు మనోజ్ భేటి

పవన్ కళ్యాణ్ తో మంచు మనోజ్ భేటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవర్ హౌస్ దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ భీమ్లా నాయక్. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా షూటింగ్ స్పాట్ లో పవన్ కళ్యాణ్ ను మంచు మనోజ్ కలిశారు. స్వతహాగా పవన్ కళ్యాణ్‌ అంటే మంచు మనోజ్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అలాగే మంచు మనోజ్ పట్ల పవన్ కళ్యాణ్ ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. వీరిద్దరూ సుమారు గంటకు పైగా పలు విషయాల పై చర్చించుకున్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు తాజా చిత్రాల ప్రస్తావన వచ్చిందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular