Tuesday, March 17, 2026
HomeసినిమాManchu: మంచు మనోజ్‌ కొత్త సినిమా అనౌన్స్ మెంట్

Manchu: మంచు మనోజ్‌ కొత్త సినిమా అనౌన్స్ మెంట్

మంచు మనోజ్ గత కొన్ని రోజులుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే.. ఇక పై చేయబోయే సినిమాలు మరో ఎత్తు. ఇప్పుడు ఆయన పూర్తిగా డిఫరెంట్ జానర్‌లను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. నేడు (మే 20) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియచేశారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చింది.

ఎల్ ఎస్ ప్రొడక్షన్స్‌ మీద శ్రీమతి మమత సమర్పణలో ప్రొడక్షన్ నెం.3 గా ఈ సినిమా రాబోతోంది. ఎం శ్రీనివాసులు, డి వేణు గోపాల్, ఎం మమత, ముల్లపూడి రాజేశ్వరి సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భాస్కర్ బంటుపల్లి ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా ఉంటుందని ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందని అంటున్నారు. టాలెంటెడ్ టీంతో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇతర వివరాలను మేకర్లు త్వరలోనే తెలియజేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular