ప్రభాస్ రాముడుగా, కృతి సనన్ సీతగా నటించిన సినిమా ఆదిపురుష్‌. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గతంలో విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ట్రైలర్ తర్వాత సినిమా పై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే గీతాన్ని విడుదల చేశారు. డివోషనల్ సాంగ్స్ చేయడంలో ది బెస్ట్ అనిపించుకున్న అజయ్ – అతుల్ స్వరపరిచిన ఈ గీతాన్ని రామ జోగయ్య శాస్త్రి రాశారు.

“జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్ .. నీ సాయం సదా మేమున్నాం.. సిద్ధం సర్వసైన్యం.. సహచరులై సహా వస్తున్నాం.. సకలం స్వామి కార్యం.. మహిమాన్విత మంత్రం నీ నామం”.. అంటూ సాగే ఈ గీతాన్ని అద్భుతమైన ట్యూన్ తో స్వరపరిచారు అజయ్ – అతుల్ ద్వయం. ఒక్కో బీట్ హృదయాలు ఉప్పొంగేలా కనిపిస్తోంది. రావణుడితో యుద్ధానికి సన్నద్ధం అవుతున్న సందర్భంలో వచ్చే గీతంలా కనిపిస్తోందీ పాట. రామ జోగయ్య శాస్త్రి రచన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే సాహిత్యంతో సింపుల్ గా ఉన్నా.. బలమైన పదజాలం కనిపిస్తోంది.

పాటలో వాడిన ఇన్ స్ట్రుమెంట్స్ లో డ్రమ్స్ మోత థియేటర్స్ దద్దరిల్లేలా కనిపిస్తోంది. ట్రైలర్ తర్వాత హై ఎక్స్ పెక్టేషన్స్ తెచ్చుకున్న ఆదిపురుష్ లోని ఈ గీతం ప్రేక్షకులకు భక్తితో కూడిన ఒక రకమైన పూనకం తెప్పించేలా ఉంది. 2023లో మోస్ట్ అవెయిటెడ్ మూవీగా ఉన్న ఈ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *