కోల్ కతా నైట్ రైడర్స్ మరోసారి విజయం ముంగిట బోల్తా పడింది. చివరి ఓవర్లో విజయానికి 21 పరుగులు అవసరం కాగా, 19 పరుగులే రావడంతో ఒక పరుగు తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. కోల్ కతా బ్యాట్స్ మెన్ రింకూ సింగ్ మరో సారి అద్భుత ఆట తీరు ప్రదర్శించి 33 బంతుల్లో 6 ఫోర్లు, 4  సిక్సర్లతో 67 పరుగులతో అజేయంగా నిలిచాడు. రింకూ తో పాటు ఓపెనర్ జేసన్ రాయ్-45;  వెంకటేష్ అయ్యర్-24 మాత్రమే రాణించారు. మిగిలిన బాట్స్ మెన్ విఫలం కావడంతో కోల్ కతా ఓటమి చవి చూడాల్సి వచ్చింది.  లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్, యష్ ఠాకూర్ చెరో 2; కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్ చెరో వికెట్ పడగొట్టారు.

ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్ కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.  లక్నోజట్టు స్కోరు 14 వద్ద  ఓపెనర్ కర్న్ శర్మ (౩) వికెట్ కోల్పోయంది. క్వింటన్ డికాక్-28; ప్రేరక్ మన్కడ్-26 పరుగులు చేసి వెనుదిరిగారు. డేంజరస్ బ్యాట్స్ మెన్ స్టోనిస్ డకౌట్ అయ్యాడు.  కెప్టెన్ కృనాల్ పాండ్యా కేవలం 9 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు, 73 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన దశలో ఆయుష్ బదోనీ- నికోలస్ పూరన్ లు  ఆరో వికెట్ కు 74 పరుగులు జోడించి ఇన్నింగ్స్ గాడిలో పెట్టారు. పూరన్ 30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 58; బదోనీ-25; చివర్లో కృష్ణప్ప గౌతమ్ నాలుగు బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 11(నాటౌట్) పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176  స్కోరు చేసింది.

కోల్ కతా బౌలర్లలో వైభవ్ అరోరా, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్ తలా 2; హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ పడగొట్టారు.

నికోలస్ పూరన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *