Friday, April 19, 2024
Homeసినిమాసింగర్స్ గా అరియానా, వివియానా

సింగర్స్ గా అరియానా, వివియానా

Manchu Singers: డైనమిక్ స్టార్ విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ‘గాలి నాగేశ్వరరావు‘ అనే మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు విష్ణు. ఈ క్యారెక్టర్ రివీల్ చేసినప్పట్నుంచి సినిమా పై అంచనాలు నెలకొన్నాయి. పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ వంటి తారలు ఉండడం  సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా ఈ సినిమాలోని ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తుండటం మరో హైలైట్. తాజాగా మరో స్పెషల్ అట్రాక్షన్ ఈ సినిమాకి యాడ్ అయ్యింది.

అదేంటంటే… డా.మంచు మోహన్ బాబు మనవరాళ్లు, విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా ఈ సినిమా ద్వారా సింగర్స్ గా పరిచయం అవుతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమాలోని ఓ పాటను అరియానా, వివియానా పాడటం విశేషం. భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించారు. సినిమాకి కీలకంగా నిలిచే ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ సినిమా విషయంలో విష్ణు మంచు తీసుకుంటున్న కేర్, సినిమా పై భారీ అంచనాలు నెలకొనేలా చేస్తున్నాయి.

డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా, భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు

Also Read : మంచు విష్ణు మూవీకి ప్రభుదేవా కొరియోగ్రఫీ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్