Friday, March 29, 2024
Homeసినిమాగాలి నాగేశ్వరరావుగా మంచు విష్ణు

గాలి నాగేశ్వరరావుగా మంచు విష్ణు

Vishnu’s next: డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డి స్ర్కిఫ్ట్ అందించారు.

కాగా ఈ సినిమాలో తన చేస్తున్న ‘గాలి నాగేశ్వరరావు’ క్యారెక్టర్ గెటప్ ని తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసారు మంచు విష్ణు. ఇప్పటి వరకూ చేయని పాత్రలో ఈ సినిమాలో కనువిందు చేయబోతున్నారు విష్ణు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వ‌ర‌లో వెల్లడించడానికి ప్లాన్ చేస్తోంది చిత్రం యూనిట్. ఈ సినిమాకి కోన వెంకట్, చోటా.కె.నాయుడు, అనూప్ రూబెన్స్ వంటి క్రేజీ టెక్నీషియన్స్ సెట్ అవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్