Friday, March 13, 2026
Homeసినిమాఅంచనాలు పెంచుతున్న అభినవ్ సర్దార్ లుక్

అంచనాలు పెంచుతున్న అభినవ్ సర్దార్ లుక్

Abhinav- Mistake: విలక్షణ కథలకు ఎంచుకుంటూ క్రమంగా స్ట్రాంగ్ కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నారు యంగ్ హీరో అభినవ్ సర్దార్. ఇటీవలే ఓ వెరైటీ కాన్సెప్ట్‌‌ తో వచ్చిన ‘రామ్ అసుర్’ సినిమాలో సూరి పాత్ర పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆయన.. హీరోగా చేస్తూనే నిర్మాతగా కూడా సక్సెస్‌ఫుల్ సినిమాల రూపకల్పనలో భాగమవుతున్నారు. ఈ క్రమంలోనే ‘మిస్టేక్’ అనే మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి అభినవ్ లుక్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా మా అధ్యక్షుడు మంచు విష్ణు రిలీజ్ చేసిన ఈ పోస్టర్ సినిమా పై హైప్ పెంచేసింది.

‘మిస్టేక్’ పోస్టర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపిన మంచు విష్ణు.. ఈ పోస్టర్ చాలా ఇంటెన్స్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉందని పేర్కొన్నారు. నా స్నేహితుడు అభినవ్ సర్ధార్, మిస్టేక్ టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు అని అన్నారు మంచు విష్ణు. ASP మీడియా ఆధ్వర్యంలో ప్రొడక్షన్ నెంబర్. 2గా రాబోతున్న ఈ మూవీకి సన్నీ కోమలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అభినవ్ హీరోగా నటిస్తూనే నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఈ విలక్షణ కథను ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే  మ‌రో వైపు చిత్ర ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.

అడ్వెంచర్ కాన్సెప్ట్‌కి నేటితరం కోరుకునే విధంగా రొమాంటిక్ యాంగిల్ యాడ్ చేసి సస్పెన్స్, అడ్వెంచరస్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మిస్టేక్ చిత్రంలో సుజిత్ కుమార్, అజయ్ కతుర్వార్, తేజా అయినంపూడి, కరిష్మా కుమార్, తాన్యా, ప్రియ లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular