Tuesday, March 17, 2026
Homeసినిమా‘మా’ అధ్య‌క్షుడుగా బాధ్య‌త‌లు స్వీక‌రిచిన‌ మంచు విష్ణు.

‘మా’ అధ్య‌క్షుడుగా బాధ్య‌త‌లు స్వీక‌రిచిన‌ మంచు విష్ణు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్షుడుగా మంచు విష్ణు భారీ మెజార్టీతో గెలిచిన విష‌యం తెలిసిందే. ఈ రోజు మా అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. అయితే.. ప్రకాష్ రాజ్ వర్గం నుంచి వస్తున్న విమర్శలు.. ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ నుంచి గెలిచిన స‌భ్యులు మూకుమ్మడి రాజీనామాల పై మంచు విష్ణు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సినీ పెద్ద‌ల‌తో చ‌ర్చించి వాళ్ల రాజీనామాల‌ను వెన‌క్కి తీసుకునేలా చేస్తారా..? లేక వాళ్ల స్ధానంలో కొత్త‌వాళ్ల‌ను నియ‌మించుకుని ముందుకు వెళ‌తారా..? అనేది తెలియాల్సివుంది. ఈరోజు మంచు విష్ణు మా అధ్య‌క్షుడుగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం ఈ విష‌యాన్ని విష్ణు సోస‌ల్ మీడియా ద్వారా తెలియ‌చేసి ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యింది. మా అధ్య‌క్షుడుగా బాద్య‌త‌లు స్వీక‌రించిన సంద‌ర్బంగా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు మంచు విష్ణును అభినందిస్తూ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular