Sunday, June 14, 2026
Homeసినిమాత్వరలో విడుదల కానున్న 'బ్యాక్ డోర్'

త్వరలో విడుదల కానున్న ‘బ్యాక్ డోర్’

పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘బ్యాక్ డోర్’. ఈ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ‘క్లీన్ యు’ సెన్సార్ సర్టిఫికెట్ లభించడం విశేషం.

ఈ సంద‌ర్భంగా నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ‘బ్యాక్ డోర్’ లో కుర్రకారును కట్టిపడేసే అంశాలతో పాటు అన్ని వర్గాల వారిని అలరించే అంశాలు మెండుగా ఉన్నాయి. పూర్ణతో పాటు హీరో తేజ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. త్వరలోనే థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేసి దీపావళికి సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు. తను నటించిన “బ్యాక్ డోర్” క్లీన్ యు తో రిలీజ్ కానుండడం పట్ల హీరోయిన్ పూర్ణ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, పోస్టర్ డిజైన్: విక్రమ్ రమేష్, కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: నిర్మల, చాందిని, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ప్రొడక్షన్ డిజైనర్: విజయ ఎల్.కోట, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను, నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన – దర్శకత్వం: కర్రి బాలాజీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular