Saturday, April 20, 2024
HomeTrending Newsనేను తెలంగాణ ఆడపడుచును - గవర్నర్ తమిళిసై

నేను తెలంగాణ ఆడపడుచును – గవర్నర్ తమిళిసై

తెలుగు బాష తల్లిపాల లాంటిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన మండలి వెంకట కృష్ణారావు సంస్కృతిక పురస్కారాల ప్రధానోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మండలి వెంకట కృష్ణారావు అవార్డు సిఎంకె రెడ్డికి అందజేయడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు బాష కోసం సిఎంకె రెడ్డి చాలా కృషి చేశారని చెప్పారు. ఈ అవార్డుకి ఆయన సరైన వ్యక్తి అని కొనియాడారు. మండలి వెంకట కృష్ణారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఆయన గాంధీయ మార్గాన్ని అనుసరించారని తమిళిసై తెలిపారు. 1977 తుఫాన్ సమయంలో ఆయన సేవలు మరువలేనివని ఆమె గుర్తుచేశారు. ఇక చెన్నైలో తెలుగు మాట్లాడే వారు ఎక్కువని అన్నారు. మీరందరు తెలుగు నమ్మినవారు… అందుకే తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నానని తమిళిసై వెల్లడించారు. తాను తెలంగాణ ఆడపడుచునని, తమిళనాడు కోడలినని తమిళిసై స్పష్టం చేశారు.
మాతృభాషను రక్షించుకోవడం మన అందరి పై ఉంది

చెన్నై నుంచి పిలిపించి వెంకట కృష్ణారావు అవార్డును తనకు అందించటం ఆనందంగా ఉందని సిఎంకె రెడ్డి అన్నారు. పొట్టి శ్రీరాములు జిల్లా వాసుడై.. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో మండలి వెంకట కృష్ణారావు పూరస్కారం అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. భాష లేకపోతే జాతి లేదని, మాతృభాషను రక్షించుకోవడం మన అందరిపై ఉందని వెల్లడించారు. చదువు ఒక్కటే కాదు.. కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు ఎక్స్ ట్రా ఆక్టివిటీస్ ను ప్రోత్సహించాలని సూచించారు. దేశంలో లక్ష మంది ఆత్మహత్యలు చేసుకుంటే.. అందులో 8 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వారందరూ ప్రెషర్ వల్ల చనిపోతున్నారని చెప్పుకొచ్చారు. చదువు ఒక్కటే కాకుండా వారికీ నచ్చిన ప్రొఫెషన్ లలో వెళ్లేలా ప్రోత్సహించాలని చెప్పారు. మంచి ఆహారం, వ్యాయామం, ఎక్సర్సైజ్ మనసును తేలికగా ఉంచుతుందని, తద్వారా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు.. అవనిగడ్డ లో ఉన్న సంస్థకు వచ్చిన నగదను తాను విరాళంగా అందిస్తానని తెలిపారు.

Also Read : గవర్నర్ తమిళి సై కు మరోసారి అవమానం  

RELATED ARTICLES

Most Popular

న్యూస్