7.8 C
New York
Saturday, December 2, 2023

Buy now

Homeతెలంగాణసుధీర్ రెడ్డికి మాణిక్యం లీగల్ నోటీస్

సుధీర్ రెడ్డికి మాణిక్యం లీగల్ నోటీస్

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి లీగల్ నోటీస్ ఇచ్చారు. మాణిక్యం ఠాగూర్ తరఫున అయన లాయర్ ఆర్.అరవిందన్ నోటీసు పంపారు.  జులై 3వ తేదీన టిఆర్ఎస్ఎల్పీలో విలేకరుల  సమావేశం నిర్వహించి టీపీసీసీ అధ్యక్ష నియామకంలో మాణిక్యం ఠాగూర్ 25 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు.

తన క్లయింట్ పై నిరాధార, అసత్య ఆరోపణలు చేశారని, ఎంతో నిజాయితీగా రాజకీయాలలో తన ప్రతిష్ట పెంచుకున్న ఠాగూర్ ఈ అబద్ధపు ప్రకటనతో దెబ్బతిన్నదని నోటీసులో పేర్కొన్నారు. వారంరోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే కోటిరూపాయల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని నోటీసులో తెలిపారు న్యాయవాది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్