Saturday, November 23, 2024
HomeTrending Newsమణిపూర్ సిఎంగా బిరెన్ సింగ్ ప్రమాణ స్వీకారం

మణిపూర్ సిఎంగా బిరెన్ సింగ్ ప్రమాణ స్వీకారం

బీజేపీ సీనియర్ నేత ఎన్ బీరెన్ సింగ్ ఈ రోజు మణిపూర్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని ఇంఫాల్ లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు బిజెపి కేంద్ర పరిశీలకులుగా, ముఖ్య అధితులుగా హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా తనకు మూడు ప్రాధాన్యాలు ఉన్నాయని ఈ సందర్భంగా బిరెన్ సింగ్ వెల్లడించారు. 1.రాష్ట్రంలో అవినీతి అంతమొందించటం. 2. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను నిర్మూలించటం. 3. మణిపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్తలతో చర్చించి రాష్ట్రంలో శాంతి నెలకొనేందుకు రాజకీయంగా చొరవ తీసుకుంటానని బిరెన్ సింగ్ ప్రకటించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించడం… మొత్తం 60 స్థానాలున్న మణిపూర్‌ అసెంబ్లీలో.. బీజేపీ 32 స్థానాల్లో గెలుపొందింది. ఆదివారం జరిగిన బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో శాసనసభా పక్ష నేతగా బిరెన్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
హెయ్గాంగ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పంగీజం శరత్‌చంద్ర సింగ్‌పై 18 వేల ఓట్లతో బీరెన్‌ సింగ్‌ ఘన విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్యేగా ఐదోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2016 అక్టోబర్‌లో కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్‌పై తిరుగుబాటు చేసిన బీరెన్‌ సింగ్‌.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్