Thursday, June 11, 2026
Homeసినిమామళ్లీ తెరపైకి 'మన్మథుడు' సుందరి!

మళ్లీ తెరపైకి ‘మన్మథుడు’ సుందరి!

నాగార్జున హీరోగా చేసిన ‘మన్మథుడు’ సినిమాను ప్రేక్షకులు ఇంతవరకూ మరిచిపోలేదు. అలాగే ఆ సినిమాలో కథానాయికగా అందంగా మెరిసిన ‘అన్షు’ను కూడా ఎవరూ మరిచిపోలేదు. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ప్రేక్షకుల ముందుకు వచ్చి 20 ఏళ్లకు పైనే అయింది. అయినా ఆ సినిమాలో మల్లె చెండులా కనిపించిన ‘అన్షు’ను కుర్రాళ్లు అలా గుర్తుపెట్టేసుకున్నారు. ఆ సినిమా తరువాత టాలీవుడ్ లో అన్షు జోరు కొనసాగుతుందని చాలామంది అనుకున్నారు. కానీ ఆమె ఇక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది.

అన్షు పెళ్లి చేసుకుని ఫారిన్ వెళ్లిపోయింది. ఆ తరువాత ఆమె గురించి ఎవరికీ కూడా ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. అలాంటి అన్షు 20 ఏళ్ల తరువాత ఇటీవల మళ్లీ హైదరాబాద్ లో మెరిసింది. తనకి మళ్లీ నటించాలని ఉందనీ, అందువల్లనే ఫారిన్ నుంచి వచ్చానని ఒకటి రెండు ఇంటర్వ్యూలలో చెప్పింది. ఆ తరువాత అన్షు నాగార్జునను కలవడంతో, ఆమె అందరి దృష్టిలోకి వచ్చింది. తన వయసుకి తగిన పాత్రలు చేయడానికి ఆమె సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇండస్ట్రీలోకి వెళ్లాయి.

అలా మొత్తానికి అన్షు ప్రయత్నాలు ఫలించాయి. ఒక సినిమాలో ఆమె కీలకమైన పాత్రను  దక్కించుకుంది. సందీప్ కిషన్ హీరోగా నక్కిన త్రినాథరావు ఒక సినిమాను రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలోని ఒక పాత్రకి అన్షును తీస్కుంటే, ఆమెకి గల ఇమేజ్ కారణంగా ప్రత్యేకమైన ఆకర్షణ అవుతుందని భావించిన టీమ్, ఆమెను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. ఇక త్వరలోనే ఇక్కడ అన్షు బిజీ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular