Thursday, March 28, 2024
Homeసినిమాకనీసం ఒక్కసారైనా చేయాల్సిన సినిమా : హీరో శివ కందుకూరి

కనీసం ఒక్కసారైనా చేయాల్సిన సినిమా : హీరో శివ కందుకూరి

‘చూసీ చూడంగానే’ తో తెలుగు తెరకు పరిచయమైన శివ కందుకూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మను చరిత్ర’.. లవ్ అండ్ వార్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను ప్రొద్దుటూరు టాకీస్ ప‌తాకంపై నార‌ల శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. భరత్ పెదగాని దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ‘మను చరిత్ర’ ప్రీ ఫేస్ పేరుతో టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ “ఇంటెన్స్ లవ్ స్టోరీలతో వచ్చిన చిత్రాలు ఖ‌చ్చితంగా హిట్ అవుతాయి. దేనితోనూ పోల్చను కానీ ఇటు వంటి కథలతో వచ్చిన చిత్రాలు హిట్ అవుతాయి. ఆర్ఆర్ లేకుండా ఈ చిత్రాన్ని నేను చూశాను. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా భరత్ కథ రాసుకున్నాడు. ఎక్కడా కూడా వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు కనిపించవు. ఇక ఈ సినిమాకు అతి పెద్ద బలం గోపీ సుందర్. ఎన్నో సినిమాలు చేస్తున్నా కూడా దీనికి ఎక్కువ సమయం కేటాయించారు. అద్బుతమైన సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమాకు మరో బ్యాక్ బోన్ ధనుంజయ. ఆయన ఇప్పుడు పద్నాలుగు సినిమాలను చేస్తున్నారు. కన్నడ, తమిళం, తెలుగు, మళయాలం ఇలా అన్ని భాషల్లో నటిస్తున్నారు. రేపు పుష్ప విడుదలయ్యాక ధనుంజయ ఏంటో తెలుస్తుంది. ఇక చంద్రబోస్ గారు అద్భుతమైన పాటలు రాశారు. ప్రగతి, మేఘా ఆకాష్ ఇలా ప్రతీ ఒక్కరూ ఎంతో గొప్పగా నటించారు. శివ అద్భుతంగా చేశాడు. ఆ మాట రేపు ఆడియెన్స్ కూడా చెబుతారు’ అని అన్నారు.

దర్శకుడు భరత్ మాట్లాడుతూ “మను చరిత్ర ప్రీఫేస్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నిర్మాత శ్రీనివాస్ రెడ్డి గారికి థ్యాంక్స్. సిరా శ్రీ గారి వల్లే ఈ చిత్రం ప్రారంభమైంది. ఆయనే రాజ్ కందుకూరితో కలిపించారు. ఆయనకు స్క్రిప్ట్ నచ్చింది. ఆ తరువాత శివ, మేఘా ఆకాష్, ప్రగతి ఇలా అందరూ ప్రాజెక్ట్‌ లోకి వచ్చారు. ధనుంజయ గారు ఈ సినిమాను ఒప్పుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. నేను ఏ కథ రాసినా ముందుగా మధు గారికి వినిపిస్తాను. ఆయనే నా ఫిలాసఫర్. సినిమాటోగ్రఫర్ రాహుల్ శ్రీవాత్సవ ఈ సినిమాలో తన లైఫ్ పెట్టేశారు. చంద్రబోస్ గారు మా సినిమాకు రెండు పాటలు రాయడమే కాకుండా నటించారు. ఆయనకు చాలా థ్యాంక్స్. ఈ చిత్రానికి ప్రాణం గోపీ సుందర్ గారు. ఏడు అద్భుతమైన పాటలు ఇచ్చారు. బడ్జెట్ గురించి ఆలోచించకు.. మంచి కథ.. మంచి సినిమా తీస్తున్నాం అని నా వెన్ను తట్టిన రత్తమయ్య గారికి థ్యాంక్స్. సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ మత్తు కొంతసేపే ఉంటుంది. కానీ ‘మనుచరిత్ర’ మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంద”ని అన్నారు.

హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. ‘ప్రతీ ఒక్క నటుడు తన కెరీర్‌లో ఇలాంటి ఓ సినిమా చేయాలనుకుంటారు. అదే మనుచరిత్ర. నవ్వించాలి, ఏడిపించాలి, యాక్షన్ చేయాలని అనుకుంటారు. అలా హీరోలకు ఓ బకెట్ లిస్ట్ ఉంటుంది. నా బకెట్ లిస్ట్ అంతా కూడా ఈ ఒక్క చిత్రంతోనే నెరవేరింది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దర్శకుడు భరత్ గారికి థ్యాంక్స్. ఆయన ఇంకా ఎంతో కాలం ఇండస్ట్రీలో ఉంటాడు, ఎన్నో మంచి చిత్రాలను అందిస్తాడు. ఏ సినిమాకైనా మంచి యూనిట్ దొరకడం అదృష్టం. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరూ ప్రేమిస్తూ పని చేశారు. ప్రతీ ఒక్క ఫ్రేమ్‌లో అది మీకు కనిపిస్తుంది. ధనుంజయ్ గురించి, ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. సెకండ్ వేవ్ తరువాత వచ్చిన చిత్రాలు మీడియా వల్లే ప్రేక్షకులకు అంతగా రీచ్ అవుతున్నాయి. నా సినిమా కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను” అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్