Thursday, February 27, 2025
HomeTrending NewsDelhi: ఉరుములు, మెరుపులతో ఢిల్లీలో భారీ వర్షం

Delhi: ఉరుములు, మెరుపులతో ఢిల్లీలో భారీ వర్షం

ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటివరకు భానుడి భగభగలతో అల్లాడిపోయిన ఢిల్లీ కాస్త చల్లబడింది. ఈ రోజు (శనివారం) తెల్లవారు జాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాలతో పాటు హరియాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 40 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

భారీ వర్షం కారణంగా ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. కాగా, మే 30వ తేదీ వరకు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్