Monday, February 24, 2025
HomeTrending NewsHidma Died: బీజాపూర్-తెలంగాణా సరిహద్దుల్లో ఎన్ కౌంటర్

Hidma Died: బీజాపూర్-తెలంగాణా సరిహద్దుల్లో ఎన్ కౌంటర్

మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణా-బీజాపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతిచెందినట్లు సమాచారం. తెలంగాణ గ్రే హౌండ్స్- సీఆర్పీఎఫ్ కోబ్రా సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగినట్లు తెలుస్తోంది.

అయితే హిడ్మా మరణవార్తను మావోయిస్టు కమిటీ ధ్రువీకరించలేదు. ఈ ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా అందలేదు. పోలీసులు రేపు దీనిపై ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

తెలంగాణాలో గత కొన్నిరోజులుగా మావోయిస్టు కార్యకలాపాలు పెరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న గ్రే హౌండ్స్ దళాలు కేంద్ర బలగాలతో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు.

సుక్మా జిల్లాకు చెందిన హిడ్మా పదో తరగతి పూర్తి కాగానే మావోయిస్టుల్లో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. గెరిల్లా వార్ లో అతడు నిష్ణాతుడు. సుక్మా దాడుల్లో కూడా హిడ్మాయే కీలకంగా వ్యవహరించాడని పోలీసు రికార్డుల్లో ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్