Saturday, January 18, 2025
HomeTrending NewsMaoist: మావోయిస్ట్ అగ్రనేత మళ్ల రాజిరెడ్డి మృతి?

Maoist: మావోయిస్ట్ అగ్రనేత మళ్ల రాజిరెడ్డి మృతి?

మావోయిస్ట్ కేంద్రకమిటీ సభ్యుడు మళ్ల రాజిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారని వార్త సోషల్ మీడియాలో వస్తున్నది. మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ సాయన్న అలియాస్ మీసాలన్న అలియాస్ అలోక్ అలియాస్ దేశ్ పాండే అలియాస్ గోపన్న అనారోగ్యంతో మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అటు మావోయిస్టు పార్టీ కానీ ఇటు పోలీసులు కానీ రాజిరెడ్డి మృతి పై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్‌పూర్ పరిధిలోని శాస్త్రులపల్లికి చెందిన మల్లా రాజిరెడ్డి ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడుగా పనిచేస్తున్నారు.2009లో రాజిరెడ్డిని పోలీసులు అరెస్టు చేయగా 2013లో విడుదల కాగానే తిరిగి అజ్ఞాతం లోకి వెళ్ళాడు. ప్రస్తుతం రాజిరెడ్డి వయస్సు 70 సంవత్సరాలు. రాజిరెడ్డిపై కోటిరూపాయల నజరానా ఉంది. ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా దండకారణ్యంలో రాజిరెడ్డి మావోయిస్టు పార్టీలో అతికిలకంగా వ్యవహరిస్తున్నాడు.

ఈ రెండు నెలల వ్యవధిలో రాజిరెడ్డి కేంద్రకమిటీ నుంచి అనారోగ్యంతో మృతి చెందిన రెండవ కీలక శ్రేణి నాయకుడు. కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ కూడా అనారోగ్యంతోనే మృతి చెందారు. కరోనా నేపథ్యంలో కీలక నాయకులు అనారోగ్యం పాలయ్యారని అడపాదడపా ఇంటలిజెన్స్ వర్గాలు పాత్రికేయులకు లీక్ లు ఇస్తున్నాయి. రెండు నెలల వ్యవధిలో రెండో కీలక శ్రేణి మృతి చెందడంతో లీకుల వెనుక వాస్తవాలున్నాయనిపిస్తున్నది. ఇప్పుడు అనారోగ్య సమస్య మావోయిస్టులు ఎదుర్కుంటున్న పెను సవాల్.
RELATED ARTICLES

Most Popular

న్యూస్