Friday, March 29, 2024
HomeTrending Newsడిజిపీ ఎదుట లొంగిపోయిన మావో ఉషారాణి

డిజిపీ ఎదుట లొంగిపోయిన మావో ఉషారాణి

తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు మహిళా నేత.. తెనాలికి చెందిన ఆలూరి ఉషారాణి.. దండకారణ్య జోనల్‌ కమిటీ సభ్యురాలిగా ఉన్న ఉషారాణి మూడు దశాబ్దాలుగా విప్లవ పంథాలో కొనసాగుతున్నారు. ఆలూరి ఉషారాణి అలియాస్ విజయక్క @పోచక్క @ భాను దీదీ…31 సంవత్సరాలుగా ఆజ్ఞతంలో ఉన్నారని డిజిపీ మహేందర్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో వెల్లడించారు. ఉషారాణి తండ్రి భుజంగరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తండ్రి విరసంలో పనిచేసాడన్నారు. విరసం సభలో చాలా మందితో పరిచయం ఏర్పడింది..తండ్రి వాలెంటరీ రీటర్మెంట్ తీసుకోని దండకారణ్యం లో జాయిన్ అయ్యాడన్నారు. డెన్ కిపర్ గా పనిచేసాడని, తల్లి లలితమ్మ కూడా తండ్రి భుజంగారావు తో కలిసి ఆజ్ఞతంలో ఉన్నారు. కుటుంబంలో చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లారు.

పీపుల్స్ వార్ పట్ల ప్రభావితం అయినా ఉషారాణి అజ్ఞాతంలోకి వెళ్ళిందని డిజిపి తెలిపారు. విద్యాబ్యాసంలోనే పీపుల్స్ అనుబంధ గ్రూప్స్ లో పనిచేసిందని, తన భర్త పీపుల్స్ వార్ లో పనిచెయ్యడం తో ఆమె కూడా దళంలో జాయిన్ అయ్యిందన్నారు. 1991లో దళంలో జాయిన్ అయ్యిందని, 1998 లో భర్త వెంకటేశ్వర్ చనిపోయాడు.

ఉషారాణి రాచకొండ దళ కమండర్ గా పనిచేసిందని డిజిపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. 2002 నుండి 2011 ప్లేటున్ కమాండర్ గా పనిచేసిందని, 2011 మొబైల్ పొలిటికల్ టీచర్ గా DKSZC పనిచేసిందన్నారు. పొలిటికల్ మ్యాగజైన్స్ కు ఎడిటర్ గా పనిచేసిందని, 2019లో ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని లొంగి పోతానని పార్టీకి అభ్యర్థించిందన్నారు. ఐదు అటాక్ కేసుల్లో, బ్లాస్టింగ్ కేసుల్లో 03, అసాల్ట్ కేసు 02. ఎక్స్చేయింగ్ ఫైర్ 03 కేసులు ఉన్నాయని ఉషారాణి గురించి డిజిపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్