Wednesday, May 7, 2025
HomeTrending Newsఛత్తీస్ ఘడ్ లో ఆర్కే అంత్యక్రియలు

ఛత్తీస్ ఘడ్ లో ఆర్కే అంత్యక్రియలు

మావోయిస్టు అగ్రనేత  అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అంత్యక్రియల ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ.  తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించిన మావోయిస్టు పార్టీ. ఛత్తీస్ ఘడ్ లోని పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించినట్టు వెల్లడి.  ఆర్ కె కు కడసారి వీడ్కోలు పలికినాకే బాహ్య ప్రపంచానికి సమాచారం అందించినట్టు తెలిసింది.

శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తి చేశారు. విప్లవవీరుడి చివరి చూపు కోసం అంత్యక్రియలకు భారీగా హాజరైన మావోయిస్టులు, సానుభూతిపరులు. మావోయిస్టు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వందల సంఖ్యలో హాజరైన ఆదివాసులు మాస్టారు మృతదేహం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులు అర్పించిన మావోయిస్టులు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్