Saturday, January 18, 2025
HomeTrending Newsఛత్తీస్‌గఢ్‌ లో ఎన్‌కౌంటర్‌... 9 మంది మావోల మృతి

ఛత్తీస్‌గఢ్‌ లో ఎన్‌కౌంటర్‌… 9 మంది మావోల మృతి

ఛత్తీస్‌గఢ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. బీజాపూర్‌ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్‌ కౌంటర్‌ లో పోలీసులకు కూడా గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది.

గంగలూర్​ పోలీస్టేషన్​ పరిధిలో ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో లేంద్ర గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా)కి చెందిన సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టారు. ఆ సమయంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు.

ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టులు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన మందుపాతరలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌తో సహా ఏడు జిల్లాలున్న బస్తర్‌ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది. వారం రోజులలోనే సుమారు 20 మంది మావోయిస్టులను పోలీసులు హత మార్చారు. లోక్‌సభ ఎన్నికల మొదటి దశలో బస్తర్ ప్రాంతంలో ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగనుంది. దీంతో ఈ ప్రాంతాన్ని భద్రతా బలగాలు మరింత జల్లెడ పడుతున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్