Saturday, January 18, 2025
Homeసినిమాఆహాలో వచ్చేసిన 'మార్కెట్ మహాలక్ష్మి'

ఆహాలో వచ్చేసిన ‘మార్కెట్ మహాలక్ష్మి’

ఆహాలో వారం .. వారం మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అడుగుపెడుతున్నాయి. రకరకాల జోనర్ల నుంచి డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథలను వదులుతున్నారు. అలా హారర్ .. థ్రిల్లర్ .. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కథలను ఎంచుకుంటూ వస్తున్నారు. అలా ఈ సారి యూత్ కి ఎక్కువగా నచ్చే కంటెంట్ తో రూపొందిన ‘మార్కెట్ మహాలక్ష్మి’ని ఈ వారం ఓటీటీ తెరపైకి తీసుకుని వచ్చారు.

‘కేరింత’ సినిమాతో యూత్ లో పార్వతీశం మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత కూడా తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను పోషిస్తూ వెళుతున్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన సినిమానే ఇది. ప్రణికాన్విక కథానాయికగా ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. ముఖేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏప్రిల్ లోనే థియేటర్లకు వచ్చింది. పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం వలన, థియేటర్స్ కి ఈ సినిమా వచ్చిన విషయం కూడా ఆడియన్స్ కి రిజిస్టర్ కాలేదు. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచే ‘ఆహా’ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది.

ఇది మధ్యతరగతి తలిదండ్రుల కథ .. వాళ్ల ఆశలను నిజం చేయాలో .. తన కలను నిజం చేసుకోవాలో తేల్చుకోలేని ఒక యువకుడి కథ. ప్రేమంటే పెద్దగా నమ్మకం లేని ఒక యువతి కథ. ఇలా ఈ మూడు వైపుల నుంచి నడిచే కథ ఇది. చివరికి హీరో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేదే ట్విస్టు. ఇది యూత్ కి మాత్రమే కాదు .. పేరెంట్స్ వైపు నుంచి కూడా నడుస్తుంది గనుక, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడవలసిన కంటెంట్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్