Saturday, November 23, 2024
Homeసినిమా‘గూడుపుఠాణి’ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది : మారుతి

‘గూడుపుఠాణి’ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది : మారుతి

ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సప్తగిరి, నేహా సోలంకి జంటగా  కె.యమ్.కుమార్ దర్శకత్వంలో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మిస్తున్న చిత్రం ‘గూడుపుఠాణి’. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం సినీ అతిరధుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా వచ్చిన సినిమాటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దర్శకుడు మారుతి, స్పీకర్ రాంభూపాల్, ఆదోని ఎం.ఎల్.ఏ క్రాంతి కుమార్, అలీ, ఇన్ఫ్రా డెవలపర్ రంగారెడ్డి,  డైరెక్టర్ మున్నా, ధనరాజ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మారుతి మాట్లాడుతూ… సప్తగిరి చేస్తున్న ‘గూడుపుఠాని’ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. కొత్త నిర్మాతలు శ్రీనివాస్ రెడ్డి, రమేష్ కటారి సినిమాను ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. సప్తగిరి ప్రతి సినిమాను ఇష్టపడి చేస్తాడు. తాను భవిషత్తులో చేసే అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ కుమార్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతాప్ విద్య సంగీతం బాగుంది. చిత్ర యూనిట్ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో సప్తగిరి మాట్లాడుతూ… సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన గూడుపుఠాణి  టైటిల్ తో నేను సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు కుమార్ చెప్పిన లైన్ నచ్చి చాలా థ్రిల్ ఫీలయ్యి ఈ సినిమాచేస్తున్నాను. నేను చిన్న హీరోను అయినా కూడా ఈ సినిమాకు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు నిర్మాతలకు నా ధన్యవాదాలు. సప్తగిరి ఎక్స్ ప్రెస్స్ లో సెంటిమెంట్ , ఎమోషన్ చేసిన నేను ఇప్పటి వరకు థ్రిల్లర్ సినిమా చేయలేదు. దర్శకుడు షాట్ బై షాట్ చెప్పి నాతో చాలా ఈజీగా యాక్ట్ చేయించాడు. నాకు చెప్పిన కథలో దర్శకుడు కొన్ని మార్పులు చేసి అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. సినిమా ట్రైలర్ చూసిన వారందరూ కూడా  క్లాసీగా చాలా అందంగా ఉన్నావని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇదంతా డిఓపి పవన్ చెన్న కే దక్కుతుంది.

నన్ను సినిమాలో చాల చక్కగా చూపించారు. సంగీత దర్శకుడు  ప్రతాప్ విద్య మంచి పాటలు అందించారు. ఫస్ట్ లాక్ డౌన్ లో ఓ సినిమా తీయడానికి భయపడే రోజుల్లో అవుట్ డోర్ లో సినిమా తీసి ఎంతో మందికి ఉపాధి కల్పించిన గొప్ప నిర్మాతలు  పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ గార్లు. చిత్ర నిర్మాతలు ఎంతో దైర్యంగా మా అందరికీ సపోర్ట్ గా వుంటూ మైసూరులోని శ్రీకృష్ణ దేవాలయం, చిక్ మంగళూరు,హంపి, మేల్కొటి, కంచి, ఆ ప్రాంతాలలో షూటింగ్ చేయడం జరిగింది. ఎస్ ఆర్ ఆర్ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే పదిమంది మాట్లాడుకునే విధంగా ఉండాలని ఖర్చుకు వెనకాడకుండా మంచి అవుట్ పుట్ తో సినిమాను నిర్మించారు అని సప్తగిరి సంతోషం వ్యక్తం చేశాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్