కథ అనేది కథానాయకుడిని బట్టి అల్లుకోవడం అలవాటు చేసుకుంది. కథానాయకుడి డేట్స్ దొరికిన దానిని బట్టి, ఆయన క్రేజ్ కీ .. ఇమేజ్ కి తగిన కథను అనుకోవడం మొదలై చాలా కాలమైంది. కాంబినేషన్ ఇప్పుడు కథపై పెత్తనం చేస్తోంది. అలాంటి ఈ రోజుల్లో కథను హీరోగా చేసి నడిపించిన సినిమా ఒకటి ఇటీవల థియేటర్లకు వచ్చింది. ఆ సినిమా పేరే ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. రావు రమేశ్ ను ప్రధాన పాత్రగా చేసుకుని తెరకెక్కిన సినిమా ఇది.
బుజ్జి రాయుడు నిర్మించిన ఈ సినిమాకి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించాడు.ఇంద్రజ .. హర్షవర్ధన్ .. అంకిత్ .. రమ్య ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఆగస్టు 23వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ లో, రావు రమేశ్ ను టైటిల్ రోల్ కోసం తీసుకుని .. ఆ సినిమాను థియేటర్లకు తీసుకురావడం నిజంగా సాహసమే. కంటెంట్ పై నమ్మకంతో మేకర్స్ చేసిన ఈ సాహసం సక్సెస్ అయిందనే చెప్పాలి. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అలాంటి ఈ సినిమా ‘ఆహ’ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతోంది. త్వరలోనే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా ఆహా ప్రకటించింది. అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసింది. కథలోకి వెళితే . సుబ్రమణ్యం గవర్నమెంట్ ఉద్యోగస్తుడే .. కాకపోతే అది న్యాయపరమైన చిక్కుల్లో ఉంటుంది. అందుకు సంబంధించిన తీర్పు కోసం వెయిట్ చేస్తూ, ఏళ్లతరబడి కాలక్షేపం చేస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లో అతని ఎకౌంటులో 10 లక్షలు పడతాయి. ఆ డబ్బు ఎక్కడిది? అది సుబ్రమణ్యాన్ని ఎలాంటి చిక్కుల్లో పడేస్తుంది? అనేది కథ.