Thursday, April 18, 2024
Homeసినిమాయువ దర్శకులని మెప్పించిన 'మసూద'

యువ దర్శకులని మెప్పించిన ‘మసూద’

మళ్ళీ రావా లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి థ్రిల్లర్ తరువాత విభిన్న కథలను ఎంచుకొనే నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకం పై తన మూడవ చిత్రంగా ‘మసూద’ అనే హారర్ డ్రామాని నిర్మించారు. ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్,. సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీమియర్ ని చిత్రయూనిట్ తో పాటు యువ దర్శకులు చూశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సంద్భంగా యువ దర్శకులు ఏజెంట్ సాయి శ్రీనివాస దర్శకుడు స్వరూప్ అర్. ఎస్. జే., వెంకటేశ్ మహా, అంటే సుందరానికీ… దర్శకుడు వివేక్ ఆత్రేయ, వినోద్ అనంతోజు, సందీప్ రాజ్ లు మసూద మూవీ చూసి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. హారర్ అంటే… హారర్ కామెడీనే అనుకునే ఈ రోజుల్లో చాలా కాలం తరువాత ఒక ట్రూ హారర్ డ్రామాగా వచ్చిన మసూద సినిమా చూసి థ్రిల్ ఫీల్ అయ్యాం అన్నారు. ఇలాంటి హై టెక్నికల్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని థియేటర్ లో చూస్తేనే వారికి కలిగిన అనుభూతి, ప్రేక్షకులకి కూడా కలుగుతుందని చెప్పారు. ఈ జానర్ లో ఇంకొన్ని కథలు రావటానికి మసూద ఓ స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. మా చిన్నతనంలో చూసిన అమ్మోరు, దేవి చిత్రాలు ఏవిధంగా అయితే.. ప్రేక్షకుల్ని మెప్పించాయో.. మసూద చిత్రం కూడా అంతే జెన్యూన్ గా మెప్పిస్తుందన్నారు. ఈ కథను నమ్మి హై టెక్నికల్ వ్యాల్యూస్ తో నిర్మించిన నిర్మాత రాహుల్ యాదవ్ ని అభినందించారు.

చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. సూపర్ స్టార్ కృష్ణ గారి మరణం చాలా బాధాకరం. మహేష్‌ బాబు గారికి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మళ్లీరావా, ఏజెంట్ తరువాత మళ్లీ ఒక మంచి చిత్రం చేసినందుకు ఆనందంగా ఉంది. మసూద రేపు రిలీజ్ కాబోతోంది. మేం సినిమాను జెన్యూన్‌గా తీశాం. టెర్రిఫిక్, హారిఫిక్ ఎక్స్‌పీరియెన్స్ కోసం థియేటర్లో ఈ సినిమాను చూడండి. సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని మా నమ్మకం. సినిమా కోసం టీంలో అందరూ కష్టపడి పని చేశారు అని అన్నారు.

Also Read : నవంబర్ 18న ‘మసూద’విడుదల  

RELATED ARTICLES

Most Popular

న్యూస్