Saturday, January 18, 2025
Homeసినిమాఆగస్ట్ 2న ‘మసూద’ టీజర్

ఆగస్ట్ 2న ‘మసూద’ టీజర్

‘మ‌ళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ’ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో రాబోతోన్న మూడో చిత్రం ‘మ‌సూద‌’. కంటెంట్ రిచ్ ఫిల్మ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.  టైటిల్ లుక్ పోస్టర్ ట్రైమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకోగా.. ఇప్పుడు చిత్ర టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

ఆగస్ట్ 2న ఈ చిత్ర టీజర్‌ విడుదల కాబోతోంది. తొలి రెండు సినిమాలతో గౌతమ్ తిన్ననూరి, స్వరూప్‌లను టాలీవుడ్ కు పరిచయం చేసిన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా.. హర్రర్ డ్రామా జోనర్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంతో సాయికిరణ్ అనే మరో ప్రామిసింగ్ డైరెక్టర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. హీరోగా ‘జార్జిరెడ్డి’ ఫేమ్ తిరువీర్ (ల‌ల్లన్ సింగ్ పాత్రధారి) న‌టిస్తుండగా.. ‘గంగోత్రి’ చిత్రంలో బాల‌న‌టిగా అల‌రించిన కావ్య క‌ల్యాణ్‌రామ్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం మ‌వుతున్నారు. సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్