Monday, June 15, 2026
Homeసినిమారవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో నాలుగో చిత్రం..

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో నాలుగో చిత్రం..

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో నాలుగో చిత్రం తెరకెక్కబోతోంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్లకు ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది.’#RT4GM’ పేరుతో బ్లాక్ బస్టర్ కాంబో ఈజ్ బ్యాక్ అంటూ ఈ మూవీకి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇప్పటికే రవితేజ, గోపిచంద్ కాంబినేషన్ లో ‘డాన్ శీను’, ‘బలుపు’, ‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే.

వీరి కాంబినేషన్ లో మరో మూవీ తెరకెక్కుతుండడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ కాంబినేషన్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను  త్కరలోనే వెల్లడించనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular