Friday, November 22, 2024
HomeTrending Newsనైజీరియాలో 45 మంది ఊచకోత

నైజీరియాలో 45 మంది ఊచకోత

బందిపోటు దొంగల దాడిలో నైజీరియాలో రక్తమొడింది. నైజీరియా వాయువ్య ప్రాంతం సోకోతో ప్రావిన్సులోని గోరోన్యో  గ్రామంలో దోపిడీ దొంగలు విచ్చల విడిగా జరిపిన కాల్పుల్లో నలభై ఐదు మంది అమాయకులు చనిపోయారు. రెండు వందల మంది సాయుధులు ద్విచక్ర వాహనాలపై వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని ప్రీమియం టైమ్స్ పత్రిక వెల్లడించింది. నిత్యావసరాల కోసం వచ్చిన స్థానికులు టార్గెట్ గా ఈ దాడి జరిగిందని సోకోతో రాష్ట్ర వర్గాలు తెలిపాయి. దోపిడీ దొంగలు మార్కెట్ నలువైపులా నుంచి కాల్పులకు తెగబడటంతో గ్రామస్తులు ఎటు వెళ్ళలేని నిస్సహాయ స్థితి నెలకొంది.

ఇదే నెల 8వ తేదిన నైగెర్ సరిహద్దుల్లోని మరో గ్రామంలో దోపిడీ దొంగలు జరిపిన దాడిలో 19 మంది మృత్యువాతపడ్డారు. నైజీరియా ఉత్తర ప్రాంతంలో దోపిడీ దొంగలు, బందిపోటు ముఠాల ప్రాభల్యం అధికంగా ఉంది. వీరికి వెన్ను దన్నుగా బోకో హరాం ఉగ్రవాదులు ఈ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. నైజీరియాను ఇస్లామిక్ దేశంగా మార్చటమే లక్ష్యంగా బోకో హరాం ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ప్రభుత్వాన్ని అస్థిరం చేసేందుకు బోకో హరాం ఉగ్రవాదులు స్థానికంగా బందిపోటు ముఠాలను దోపిడీల కోసం వాడుకుంటారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్