చత్తీస్ ఘడ్ లోని కంకేర్ జిల్లాలో మంగళవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కంకేర్ జిల్లా చోటేబెతియ ప్రాంతంలోని బినగుండా ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 29 మంది మావోలు చనిపోయారని తెలిసింది. ఓ ఇన్స్పెక్టర్ తో పాటు ఇద్దరు BSF జవాన్లకు గాయాలు అయినట్టు తెలిసింది. ఘటనా స్థలం నుంచి పదకొండు మృత దేశాలను పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
మావో అగ్ర నాయకుడు శంకర్ రావు ఈ ఎదురు కాల్పుల్లో చనిపోయారని పోలీసులు వెల్లడించారు. ఆయననను పట్టుకున్న వారికి ప్రభుత్వం 25 లక్షల రివార్డు ప్రకటించింది.
మావోల నుంచి అత్యాధునిక ఆయుధాలు స్వాదినం చేసుకున్నారు. AK 47 రైఫిల్ తో ఇన్సాస్ రైఫిల్స్ తో పాటు విప్లవ సాహిత్యం ఘటన స్థలంలో లభించాయని ప్రాథమిక సమాచారం. BSF, బలగాలతో పాటు District Reserve Guard (DRG) బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుకాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు.
ఎదురుకాల్పుల ఘటనను దృవీకరించిన పోలీసు ఉన్నతాధికారులు మావోలు ఎంతమంది చనిపోయారనేది స్పష్టత ఇవ్వటం లేదు. చత్తీస్ ఘడ్ లో మొదటి దశ లోక్ సభ ఎన్నికలు మరో రెండు రోజుల్లో జరగనుండగా ఎన్ కౌంటర్ జరగటం అటవీ ప్రాంతాల ప్రజలను భయందోలనకు గురిచేస్తోంది.
-దేశవేని భాస్కర్