Saturday, January 18, 2025
HomeTrending Newsటెస్కో గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

టెస్కో గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం ధర్మారంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మారంలోని టెస్కో గోదాంలో సోమవారం రాత్రి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేశాయి. మొత్తం ఏడు ఫైరింజన్లు మంటలు ఆర్పుతున్నాయి. భారీ మంటల వల్ల గోదాం గోడలు కూడా కూలిపోవడం గమనార్హం. ఈ ప్రమాదంలో సుమారు రూ. 40 కోట్లకుపైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. గోదాంలో పాఠశాల విద్యార్థులకు అందించాల్సిన చేనేత దుస్తులను నిల్వ ఉంచారు. వీటిని పాఠశాలలకు పంపించాల్సి ఉండగా.. కరోనా వైరస్ తీవ్రత కారణంగా పాఠశాలలు తెరుచుకోకపోవడంతో నిల్వలు గోదాంలోనే పేరుకుపోయాయి.

సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించి వాచ్‌మెన్ సమాచారం ఇవ్వడంతో గోదాం ఇంఛార్జ్ శ్రీనివాస్, డీఎంవో శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఏడు ఫైరింజిన్లు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read : మృతుల కుటుంబాలకు పరిహారం

RELATED ARTICLES

Most Popular

న్యూస్