Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్మయాంక్ సెంచరీ - కోహ్లీ ఔట్ వివాదాస్పదం

మయాంక్ సెంచరీ – కోహ్లీ ఔట్ వివాదాస్పదం

Mayank Agarwal Century :

న్యూజిలాండ్ తో జరుగుతోన్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్ మయంక్ అగర్వాల్ సెంచరీతో రాణించాడు కివీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ అజాజ్ పటేల్ ఇండియా టాపార్డర్ ను దెబ్బ తీశాడు. ఈరోజు ఇండియా కోల్పోయిన నాలుగు వికెట్లూ అజాజ్ తన ఖాతాలోనే వేసుకున్నాడు.

పిచ్ పై తేమ కారణంగా ఆట రెండున్నర గంటలపాటు ఆలస్యమైంది. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు, కోహ్లీ, జయంత్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చారు. గాయం కారణంగా అజింక్యా రేహానే, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజాలకు విశ్రాంతి ఇచ్చారు.

శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్ లు ఇన్నింగ్స్ ఆరంభించి తొలి వికెట్ కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  గిల్ 44  పరుగులు చేసి అజాజ్ బౌలింగ్ లో రాస్ టేలర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  అజాజ్ ఇన్నింగ్స్ 30వ ఓవర్లో పుజారా(బౌల్డ్), కోహ్లీ(ఎల్బీ)…ఇద్దరినీ డకౌట్ చేసి గట్టి దెబ్బతీశాడు. మొదటి టెస్ట్ లో మాన్ అఫ్ ద మ్యాచ్ గెల్చుకున్న శ్రేయాస్ అయ్యర్ ఈ టెస్టులో 18 పరుగులు చేసి టామ్ బ్లండేల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మయాంక్-120; వృద్ధిమాన్ సాహా 25 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.

విరాట్ ఔట్ వివాదాస్పదం
ఇన్నింగ్స్ 30 వ ఓవర్లో రెండో బంతికి పుజారాను బౌల్డ్ చేసిన అజాజ్ విసిరిన చివరి బంతి కోహ్లీ బ్యాట్ ను తాకి తర్వాత ప్యాడ్ ను తాకింది, అంపైర్  ఔట్ ప్రకటించాడు, ఈ నిర్ణయంతో నిరాశ చెందిన కోహ్లీ అప్పీల్ కు వెళ్ళాడు. థర్డ్  అంపైర్ కూడా ఔట్ గా తేల్చడంతో కోహ్లీ ఒకింత అసహనానికి గురయ్యాడు.

Also Read : రేహానే, జడేజా, ఇషాంత్ ఔట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్