Saturday, January 18, 2025
HomeTrending NewsDubbaka: ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి

Dubbaka: ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి

దుబ్బాక బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఓ వ్యక్తి హఠాత్తుగా దూసుకు వచ్చి ఆయనపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయనకు కడుపు భాగంలో గాయాలయ్యాయి.

దాడి జరగగానే అక్కడే ఉన్న బిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన రాజును పట్టుకొని చితకబాదారు. మీర్ దొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన యూ ట్యూబర్ రాజు అనే యువకుడు కత్తితో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. రాజు ఎవరు? ఎందుకు దాడి చేశారు? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

దాడి అనంతరం ఎంపీ ప్రభాకర్ రెడ్డిని ఆయన వాహనంలోనే గజ్వేల్‌కు తరలించి అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. బలమైన గాయాలు కాలేదని..ప్రాణాపాయం ఏమి లేదని గజ్వేల్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.  నారాయణ్ ఖెడ్ సభకు వెళ్తూ విషయం తెలియగానే గజ్వేల్ ఆసుపత్రికి మంత్రి హరీశ్ రావు వెళ్లారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్