మేడారం మహా జాతర ఏర్పాట్లను తనిఖీ చేస్తూనే, వచ్చే భక్తులు, వీ ఐ పీ లు, వి. వీ ఐ పీ లు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ఎదుర్కొని వాళ్లకు దర్శనం కలిపిస్తూ, అధికారులతో ఏర్పాట్లను చర్చిస్తూ, సమన్వయ పరుస్తూ, కమాండ్ కంట్రోల్ రూం నుంచి, మంచే నుంచి మేడారం జాతర జరిగే తీరును పరిశీలిస్తూ, అధికారులకు తగు ఆదేశాలు ఇస్తూ, మైకులో భక్తులతో మాట్లాడి పలు సూచనలు చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మేడారం మహా జాతర నిర్వహణ లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కీలక పాత్ర పోషిస్తున్నారు.
అధికారులతో సమన్వయం చేస్తూ..
మంత్రి ముందుగా సీఎం కెసిఆర్ మేడారం రానున్న అందున కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ తో కలిసి హెలిప్యాడ్ ను పరిశీలించారు. ఆ తర్వాత గద్దెల వద్దకు చేరుకుని అక్కడ పరిస్థితులను సమీక్షించారు. మైకు లో మాట్లాడుతూ భక్తి ప్రపత్తులతో అమ్మవారిని కొలుచుకే భక్తులు క్యూ పద్ధతిని పాటిస్తూ, తోపులాట లేకుండా, బంగారం, కొబ్బరికాయలు విసిరి వేయకుండా జాగ్రత్త వహించాలని భక్తులకు సూచనలు చేశారు. అక్కడి పోలీసు అధికారులతో మాట్లాడి భక్తులకు ఇబ్బందులు కలగకుండా గద్దె ల ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అదేశించారు.
క్యూ లైన్లలోకి వెళ్లి భక్తులను పలకరిస్తూ…
ఆతర్వాత క్యూ లైన్లలో కి వెళ్లి భక్తులతో మాట్లాడారు. రాంగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య రాగా వాళ్ళతో మాట్లాడి దర్శనం ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ఎంపీ కవిత, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు, ఎమ్మెల్యేలు కృష్ణా రావు, వివేకానంద, తాటి రాజయ్య, శంకర్ నాయక్, రెడ్యా నాయక్, ఆరూరు రమేశ్ తదితరులకు దర్శనం కల్పించి, అతిధ్యమిచ్చి పంపించారు. దేవాదాయ ధర్మాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలిసి ఎప్పటికప్పుడు జాతర పరిస్థితులను పరిశీలించారు.
మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ని కలిసి దర్శనం ఏర్పాట్లు చూశారు. తెలంగాణలో ఎర్రబెల్లి గట్టి మంత్రి ప్రశంసిస్తూ, కేంద్ర సహాయ మంత్రి రేణుకా సింగ్ కు పరిచయం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర గిరిజన అభివృద్ధి శాఖ సహాయ మంత్రి రేణుక సింగ్ లు మీడియా పాయింట్ నుంచి ఎదురు పడిన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి ఎర్రబెల్లి ఎదురు పడగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రేణుక సింగ్ కు ఎర్రబెల్లి ని పరిచయం చేస్తూ, తెలంగాణలో గట్టి మంత్రి అంటూ చేతులతో గట్టి అనే అర్థం స్ఫురించేలా ఊపుతూ అన్నారు. అలాగే పంచాయతీ మంత్రి అంటూ కిషన్ రెడ్డి చెప్పగానే, మంత్రి ఎర్రబెల్లి స్పందిస్తూ, పంచాయతీలు పెట్టే మంత్రిని కాను, పంచాయతీలు పరిష్కరించే మంత్రి ని అంటూ, రేణుక సింగ్ తో అనడం తో అక్కడ నవ్వులు విరిసాయి.
జాతర ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష
అనంతర మంత్రి ఎర్రబెల్లి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కొద్దిసేపు ముచ్చటించి, జాతర ఏర్పాట్లు, సదుపాయాలు ఎలా ఉన్నాయంటూ ఆరా తీశారు. అలాగే మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రి జాతర మొత్తం తిరుగుతూ చేస్తున్న సూచనలు, సలహాలు, సమన్వయం పై భక్తులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.